బిజెపి పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో సిలిండర్ల పంపిణీ

Published: Monday May 09, 2022

కొడిమ్యాల, మే 08 (ప్రజాపాలన ప్రతినిధి) : కొడిమ్యాల మండలంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ సిలిండర్ ల పంపిణీ. కేంద్ర ప్రభుత్వం ప్రదానమంత్రి ఉజ్వలయోజన ద్వారా ప్రతి ఇంటికి ఉచిత సిలిండర్ లను అందిస్తుంది, అందులో భాగంగా ఈరోజు కొడిమ్యాల లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎర్రోజు. శ్రీనివాస చారి గ్రామంలోని సుమారు 25 మందికి హెచ్.పి. గ్యాస్ గోవిందారం వారు ఉచిత సిలిండర్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ నాంపెల్లి రాజేశం, అంకం జనార్దన్, మచ్చ రాజు, అంకం మహేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు