ఆయుష్మాన్ భారత్ పోస్టర్ని ఆవిష్కరించిన ఎమ్ఆర్ఓ శంకరపట్నం జనవరి 20 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Saturday January 21, 2023

ప్రభుత్వం నూతనంగా  ప్రవేశ పెట్టిన ఆయుశ్మాన్ భారత్ పథకంలో  అర్హులైన పౌరులు  తమ పేర్లను కామన్ సర్వీస్ సెంటర్ లలో నమోదు చేసుకోని కార్డులు పొందాలని  మండల తహశీల్ధార్ గూడూరి శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రలో ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్టంలో అమలుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది .ఇట్టి సందర్భంగా ఆయుష్మాన్ భారత్ పోస్టర్ని శుక్రవారం శంకరపట్నం ఎమ్ఆర్ఓ ఆవిష్కరించారు .ఇట్టి పథకం ద్వారా కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కలదు.ఇట్టి కార్యక్రమంలో కామన్ సర్వీస్ సెంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఏలూరి శ్రీధర్ బాబు ,కామన్ సర్వీస్ సెంటర్ విఎల్ ఇ బొంగొని అభిలాష్ ,రైతులు తధితరులు పాల్గొన్నారు.