గ్రామంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించిన సర్పంచ్

Published: Saturday July 30, 2022
బోనకల్, జులై 29 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలో ఆళ్లపాడు గ్రామంలో వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సర్పంచ్ మర్రి తిరుపతిరావు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో వివిధ రకాల వ్యర్ధపదార్థాలను, చెత్తాచెదారాలను గుర్తించి వాటి పరిష్కరించేందుకు ఇలాంటి చెత్తాచెదారాలు లేకుండా చేసుకోవాలని పరిసర ప్రాంత వాసులకు తెలియ చేశారు. వాతావరణం పరిస్థితుల వలన వ్యర్థాలు చేత్త చేదారం నీటి నిల్వలు కలుషితమై డెంగ్యూ దోమలు ఏర్పడి డెంగ్యూ ప్రభావితం కాకుండా రక్షణ చేసుకోవాలని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని వర్షాభావ పరిస్థితుల వలన కలిగే నష్టాలను ప్రభావితం కాకుండా చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ దానయ్య, ఏఎన్ఎం తిరుపతమ్మ ,పంచాయతీ కార్యదర్శి పరశురాము, ఆశా కార్యకర్తలు కళావతి, రత్నకుమారి, అంగన్వాడీ టీచర్లు పద్మ, గౌరమ్మ, హుస్సేన్ బీ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.