ఘనంగా జాతీయ హిందీ భాష దినోత్సవం

Published: Thursday September 15, 2022
బోనకల్, సెప్టెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల ఉన్నత పాఠశాలలో బుధవారం ఘనంగా జాతీయ హిందీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీ ఉపాధ్యాయులు ఎండి గౌసుద్దీన్ మాట్లాడుతూ దేవనగరి లీఫీ లో ఉన్న హిందీ భాషను సెప్టెంబర్ 14, 1949 న భారతదేశ అధికార భాషగా స్వీకరించారని, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14న హిందీని దేశ అధికార భాషగా స్వీకరించినందుకు గుర్తుగా హిందీ దివస్ లేదా హిందీ జాతీయ భాష దినోత్సవాన్ని జరుపుకుంటారని,హిందీ యొక్క ప్రాముఖ్యత విశిష్టతను, లాభాలను గురించి వివరించారు.అనంతరం హిందీ దివస్ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ , కవితల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఇందిరా జ్యోతి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు ఎం. శ్రీనివాసరావు, ఏ శ్రీహరి. ప్రమీల, షర్మిల కుమారి విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.