ఆళ్లపాడు లో మిర్చి తోటలు పరిశీలించిన సర్పంచ్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు

Published: Thursday November 25, 2021
బోనకల్, నవంబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామంలో మిర్చి తోటలో కొత్త రకం వైరస్ వలన నష్టపోయిన పంటలను సర్పంచ్ మర్రి తిరుపతిరావు ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించారు. ఆళ్లపాడు గ్రామంలో రైతుల బృందం పర్యటించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అధికారులు వెంటనే గ్రామానికి రావాలన్నా విజ్ఞప్తితో బోనకల్ మండల వ్యవసాయ అధికారి అబ్బూరి శరత్ బాబు, ఉద్యానవన శాఖ అధికారి ఆకుల వేణులు ఆళ్లపాడు ఏఈఓ వై సాధన గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల వలన నల్ల తామర పురుగులు ఏర్పడ్డాయని వాతావరణంలో మార్పులతో నే ఈ పురుగులు కూడా పోతాయన్న అంచనాల్ని శాస్త్రవేత్తలు అంచనా వేశారన్నారు. ఉద్యానవన శాఖ అధికారి వేణు మాట్లాడుతూ ఎక్కువ ఖరీదు గల మందులు వాడకుండా స్పైరోటెట్రా మైట్( మెమెంటో) 1.25 మీ.లి/లీటర్ నీటికి, స్పైనోసాడ్( ట్రెసర్) 04.మీ .లి/లీటర్ నీటికి,క్లోరోపేనఫైర్ (ఇంటర్ ప్రీడ్) 2 మీ. లి/లీటర్
థియాక్లోప్రీడ్(అలాంటో) 2-మీ.లి /లీటర్ నీటికి
స్పైనోటోరం (డిగిలెట్) 2 మీ లి/లీటర్ నీటికి 
వేపనునే (10000పిపిఎం) 3మీ.లి / లీటర్ నీటికి మందులను పిచికారీ చేస్తే ఫలితం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారన్నారు. రైతులు అనవసరంగా ఖరీదు గల మందులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో తక్కువ ఖరీదు ఉన్న మందుల్ని వాడాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అధికారుల వెంట గ్రామరైతు కమిటీ అధ్యక్షుడు దొంతి బోయిన భూశయ్య, రైతు పార వేంకటేశ్వర్లు మంద సొమయ్య, వేముల నరేష్, కందుల శ్రీను, మంద ఆంజనేయులు, మంద వేంకటేశ్వర్లు, కూరకుల నాయుడు, బండి నాగేశ్వరరావు, మరీదు తిరుపతి రావు, తదితరులు పాల్గొన్నారు.