జర్నలిస్టుపై దాడి అప్రజాస్వామికం

Published: Monday June 13, 2022

టి.యు.డబ్ల్యు.జే (ఐ.జే.యు)

జగిత్యాల, జూన్ 12 (ప్రజాపాలన ప్రతినిధి): గోదావరిఖని సీవీఆర్ జర్నలిస్ట్ కుమార్ పై దాడి అప్రజాస్వామికమని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టియుడబ్ల్యుజే (ఐజేయు) జగిత్యాల జిల్లా శాఖ, జగిత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన డిమాండ్ చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో గోదావరిఖనిలో సీవీఆర్ రిపోర్టర్ పై తెరాస కార్పొరేటర్ దాడిచేయడం దారుణమన్నారు. కేవలం రోడ్డుకు కారు అడ్డంగా ఉందన్న కోపంతో తెరాస కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య అతని అనుచరులు తాగిన మైకంలో సీవీఆర్ రిపోర్టర్ పై ఆకారణంగా దాడికి దిగారని టియుడబ్ల్యు జే ఐజేయు జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, మోరపెల్లి ప్రదీప్,  సీవీఆర్ రిపోర్టర్ లు గడ్డల హరికృష్ణ, లింగారెడ్డి, ఐజేయు జిల్లా శాఖ, జగిత్యాల ప్రెస్ క్లబ్ కార్యదర్శి గూడ మల్లారెడ్డి, ప్రెస్ క్లబ్ బాద్యులు, సభ్యులు అన్నారు. ఎవరు ఏమిచేయలేరన్న అహంకారంతో తెరాస కార్పొరేటర్ దాడికి దిగాడని ఇలాంటి చర్యను ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా వ్యతిరేకించాలని వారు కోరారు. ప్రభుత్వం ఇలాంటి దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలకు ఆదేశిస్తూ మీడియా ప్రతినిధుల రక్షణకై కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు కోరారు. ఇలాంటి దాడులు ఇకముందు జరుగకుండా ఉండాలంటే గట్టయ్య, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే ఐజేయు, జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఉద్యమం చేపట్టాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.