పోడు భూములకు పట్టాలిచ్చేందుకు నివేదికలు సిద్ధం చేయాలి

Published: Friday February 10, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 9 ఫిబ్రవరి ప్రజాపాలన : 
ప్రభుత్వ ఆదేశాల మేరకు పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు నివేదికలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులు ఆదేశించారు.
గురువారం పోడు భూములపై సంబంధిత శాఖల అధికారులచే జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , డిఆర్ఓ అశోక్ కుమార్ లతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 426 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా స్థాయి కమిటీలో ఆమోదించడంతో వీటికి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.2005 డిసెంబర్ 13 కంటే ముందు పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం యోచిస్తుందని దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని ఆయన తెలిపారు.  2005 సంవత్సరం కంటే ముందు నుండి పోడు భూముల్లో సాగు చేస్తున్నట్టుగా వచ్చే అర్జీలకు  గ్రామ పెద్దల అవిడేవిట,  రేషన్ కార్డు వివరాలను తీసుకోవాలని అధికారులకు సూచించారు.  అటవీ సంపదనను కాపాడాల్సిన బాధ్యతను గుర్తెరిగి అధికారులు ఇకపైన అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.   పోడు భూముల ప్రక్రియను ఈనెల 13 నుండి 17 వరకు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా గిరిజన అభివృద్ధి  శాఖ అధికారి కోటాజి, వికారాబాద్ ఆర్డిఓ విజయ కుమారి,  తాసిల్దార్లు,  అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.