పీర్జాదిగూడలో 1.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డి

Published: Tuesday June 22, 2021
మేడిపల్లి, జూన్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో మున్సిపల్ జెనరల్ ఫండ్ నిధులు రూ౹౹ 1.54 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి హాజరై అభివృద్ధి పనులను ప్రారంభిచారు. 9 డివిజన్ రాఘవేంద్ర నగర్ కాలనీలో 44 లక్షలతో సీసీ రోడ్డును స్థానిక కార్పొరేటర్ బచ్చ రాజుతో కలిసిశంకుస్థాపన, 13వ డివిజన్  పి అండ్ టి కాలనీలో 23 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ కు స్థానిక కార్పొరేటర్ తూంకుంట్ల ప్రసన్న లక్ష్మి శ్రీధర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన, 25వ డివిజన్ లోని సాయి నగర్ కాలనీ యందు 15 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ కు స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరి శంకర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన, 26వ డివిజన్ శంకర్ నగర్ కాలనీలో 38 లక్షలతో సీసీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డితో కలిసి శంకుస్థాపన, 18వ డివిజన్ పార్వతీ నగర్ కాలనీలో 10 లక్షలతో  పార్క్ ప్రహరీ గోడ స్థానిక కార్పొరేటర్ కుర్ర శాలిని శ్రీకాంత్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన, 3వ డివిజన్లోని సాయి ఐశ్వర్య కాలనీలో 24 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ కు స్థానిక కార్పొరేటర్ బైటింటి శారదా ఈశ్వర్ రెడ్డితో కలిసి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. తదుపరి హరితహారంకార్యక్రమంలో భాగంగా సాయి ప్రియా కాలనీలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ ఎస్తేరు అనిత, డిప్యూటి మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు కె.సుభాష్ నాయక్, కోల్తూరు మహేష్, వీరమల్ల సుమలత, మద్ది యుగేందర్ రెడ్డి, అలువాల సరిత, కౌడే పోచయ్య, ఎంపల్ల అనంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు బొడిగే రాందాస్ గౌడ్, చిలుముల జగదీశ్వర్ రెడ్డి, షేక్ ఇర్ఫాన్, నాయకులు దర్గ దయాకర్ రెడ్డి, మాడుగుల చంద్రా రెడ్డి, పప్పుల అంజిరెడ్డి, బైటింటి ఈశ్వర్ రెడ్డి, యాసారం మహేష్, లేతాకుల రఘుపతి రెడ్డి, వీరమల్ల సత్యనారాయణ, తూముకుంట్ల శ్రీధర్ రెడ్డి, పాశం బుచ్చి యాదవ్, బండారు రవీందర్, బండి సతీష్ గౌడ్, కుర్ర శ్రీకాంత్, అలువాల దేవేందర్ గౌడ్, చెరకు పెంటయ్య గౌడ్, జావిద్ ఖాన్, అధికారులు మున్సిపల్ మేనేజర్ జ్యోతి, డి ఈ శ్రీనివాస్, ఏ ఈ వినీల్, రెవెన్యూ ఆఫీసర్ అనిల్ కుమార్, టిపిఎస్ పావని, ఆర్ ఐ ఫనిందర్, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.