మండల కేంద్రంలో ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

Published: Saturday June 11, 2022

బోనకల్, జూన్ 10 ప్రజాపాలన ప్రతినిధి: నందమూరి నటసింహం, టాలీవుడ్ లెజెండ్,బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే,నందమూరి బాలకృష్ణ 62వ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని సినిమా హాల్ సెంటర్ లో ఎన్.ఎస్. ఆర్ చౌదరి మరియు నందమూరి వెంకట కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు రావుట్ల సత్యనారాయణ, పార్లమెంటరీ రైతు అధ్యక్షుడు నందమూరి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జర్పుల బాలకృష్ణ, గుడిమల్ల నరసింహారావు, నల్లమల కృష్ణ, ముక్కాల రాము, దాసు, మట్టా ప్రతాప్, నాని,ప్రదీప్,బాలకృష్ణ, నందమూరి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.