కౌలు రైతు ఆత్మహత్య యత్నం

Published: Wednesday May 19, 2021

పాలేరు, మే 18, ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు గడ్డం లింగయ్య అనే కౌలు రైతు పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు మార్కెట్ యార్డ్ కి తీసుకొని వచ్చి 25 రోజులు దాటినా నేటికీ కాటాలు వేయకపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించటం జరిగింది. అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడం జరుగుతుంది. రైతు జరిగిన అన్యాయానికి ఆందోళనకు గురైన రైతులు తహసిల్దార్ ఆఫీస్ ముందు రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. రైతులు చేస్తున్న ధర్నా స్థలానికి. సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్, ట్రైనీ ఎస్ఐ కుశక్ కుమార్, చేరుకొని రైతుల తో రైతులతో మాట్లాడి నిజాన్ని పూర్తిగా కొనుగోలు చేసే విధంగా అధికారులతో మాట్లాతమని హామీ ఇవ్వడం జరిగినది. అనంతరం తహసీల్దార్ తాళ్లూరి సుమ రైతులు కూర్చున్న స్థలానికి చేరుకుని రైతులకు అన్యాయం జరగకుండా వెయ్యి బస్తాలు తేప్పించి రైతుల ధాన్యాన్ని కాటా ఏ పిస్తాను అని హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు మన్నె కృష్ణారావు, పిట్టల ఎంకన్న, మన్నె శ్రీను, మేకల శ్రీను, పగిడి కత్తుల రామదాసు, రాము, కె.వి.రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.