కాంగ్రెస్ పార్టీలో చేరిన నాగవరప్పాడు గ్రామానికి చెందిన పలు కుటుంబాలు మధిర రూరల్

Published: Wednesday December 28, 2022
డిసెంబర్ 27 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ లో నాగవరప్పాడు గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ మరియు ఇతర పార్టీల నుండి 15 కుటుంబాలు సీఎల్పీ బట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *సూరంసెట్టి కిషోర్* ఆధ్వర్యంలో  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనసభా పక్ష నేత *మల్లు భట్టి విక్రమార్క* గారు వారికి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ఉచిత హామీలు అని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ అన్ని కులాలను విస్మరించి కులానికి బర్రె, గొర్రె చెప్తూ కులాలను విభజించి పాలిస్తున్నారన్నారని.ప్రజలకు సరైన పాలన అందించటం లో అధికారపార్టీ విఫలం అయింది అని అందుకే విసుగుచెంది కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు పేర్కోన్నారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు..
కాంగ్రెస్ పార్టీ లో చేరినవారు...
*కోట అప్పారావు, రాయబారపు చిన్న వెంకటేశ్వర్లు, పుట్టా ఏసోబు, వెల్లంకి నాని, మోదుగు చెంచయ్య, మోదుగు చిన్న పుల్లయ్య, మారిపోగు ఏసోబు, తాళ్లూరి భాస్కర్, దోమందుల శీను, కోటా నాగేశ్వరరావు,* మొదలగువారు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు *ధారా బాలరాజు* సైదల్లిపురం సర్పంచ్ *పులి బండ్ల చిట్టిబాబు* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* పట్టణ కాంగ్రెస్ నాయకులు *షేక్ జహంగీర్, ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి* మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు