లోక కళ్యాణార్థం ఆదిదంపతుల కళ్యాణ ఉత్సవం

Published: Saturday October 08, 2022
*శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయం చతుర్థ వార్షికోత్సవం
* ఆలయం వ్యవస్థాపకుడు అర్థ సుధాకర్ రెడ్డి

వికారాబాద్ బ్యూరో 07 అక్టోబర్ ప్రజాపాలన : లోక కళ్యాణార్థం ఆది దంపతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయం వ్యవస్థాపకుడు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని న్యూ గాంధీ గంజ్ సమీపములోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయం పునఃనిర్మిత చతుర్థ వార్షికోత్సవాన్ని అర్థ సుధాకర్ రెడ్డి పుణ్యదంపతులు ఆదిదంపతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వస్తిశ్రీ చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సర అశ్వయుజ శుద్ధ ద్వాదశి శుక్రవారం అన్నపూర్ణ సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ ధ్వజారోహణ, 6 గంటలకు అఖండ దీపారాధన గణపతి పూజ పుణ్యాహచనం సర్వతో భద్ర మండల నాందీ సమారాధనం పంచాచార్య సవగ్రహ పూజ రుద్రాభిషేకం ఉదయం 9 గంటలకు గణపతి హోమం రుద్ర హోమం పూర్ణాహుతి 11 గంటలకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కితకిటలాడింది. ఆలయంలో భక్తి భావం ఉప్పొంగే విధంగా వేదమంత్రోచ్ఛారణలతో ప్రతిధ్వనించింది. రుద్రాభిషేకంలో నమ్మకము చమకము శ్రీ సూక్తము పురుష సూక్తం వంటి వేదమంత్రాలతో వేద బ్రాహ్మణోత్తములు ముక్తకంఠంతో ఉచ్చరించారు. అనంతరం నారాయణ సేవ ( మహాన్న దానం )లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.