*30 లక్షల నిధులతో పోతుగల్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం* -తండాల్లో మౌలిక* *సదుపాయాలకు ప్రాధాన్య

Published: Friday November 04, 2022
వెనుకబడిన పంచాయతీ అభివృద్ధికి 30 లక్షల నిధులు సమకూర్చి అభివృద్ధి పరుస్తామని షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు.
గురువారం పోతుగల్ గ్రామంలో ఆయన పర్యటించి గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నారు.  పోతుగల్ తాండా వాసులతో వారి సమస్యలను విన్నారు.
అనంతరం అవినాష్ రెడ్డి మాట్లాడుతూ పోతుగల్ పంచాయతీకి ఇప్పటికే సుమారు 10 లక్షల నిధులు కేటాయించామని చెప్పారు. అలాగే మరో 20 లక్షల నిధులతో  సిసి రోడ్ల నిర్మాణాలు, మురుగు కాలువల నిర్మాణాలు  చేపట్టే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వెంటనే రూ. 5 లక్షల యూజీడీలను ప్రారంభించినాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ నక్క శ్రీనివాస్ గౌడ్, ఆయూబ్ ఖాన్, మునీర్,  సత్యనారాయణ, ఉప సర్పంచ్ రాజు, బిఖ్యానాయక్,యేషాన్,కృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.