గ్రామాల సమగ్రాభివృద్ధే మీతో నేను లక్ష్యం

Published: Wednesday November 24, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరో 23 నవంబర్ ప్రజాపాలన : గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం బంట్వారం మండల పరిధిలో గల మాలసోమారం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి తో కలిసి వీధి వీధి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చి పల్లె ప్రగతి ద్వారా దశల వారిగా అభివృద్ధికై కృషి చేస్తుందన్నారు. గ్రామంలోని ఇళ్ళ మధ్యలో ఉన్న పాడు బడ్డ ఇళ్లను తొలగించాలని సూచించారు. మురుగు కాలువల పరిశుభ్రత పాటిచాలన్నారు. బావులపై జాలీ ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవంతికి ఆదేశించారు. గ్రామానికి ప్రధాన సమస్యగా ఉన్న (కంత) నీటి కాలువ సమస్యను పరిష్కరించుకుందామని అన్నారు. మాలసోమారం నుండి బార్వాద్, వికారాబాద్ మార్గంలో నూతన రోడ్డుకు కృషి చేద్దామన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నందున జిల్లా విద్యాధికారి రేణుకతో ఫోన్ లో మాట్లాడి వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు ఖాజపాష, సర్పంచుల సంఘం అధ్యక్షుడు తలారి నర్సింలు, ఎంపిటిసి ప్రశాంతి శరణారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచులు నరసింహారెడ్డి, బలవంత్ రెడ్డి, నర్సింలు నాయకులు కరీం పాషా మల్లారెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.