భారీ వర్షానికి జలమయమైన రోడ్డు

Published: Saturday July 23, 2022
బోనకల్, జూలై 22 ప్రజా పాలన ప్రతినిధి: శుక్రవారం ఉదయం నుండి ఈదురు గాలులతో ఎడతెడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి మండల కేంద్రంలో ఫ్లై ఓవర్ పక్కన ఉన్న రోడ్డు జలమయంగా మారింది. రోడ్డుపైకి భారీగా వరద నీరు చేరింది. వరద నీరు చేరడంతో వాహనదారుల రాకపోకలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. భారీ వర్షం కారణంగా జలమయమైన రోడ్డు నుండి వర్షపు నీరు ఎటు పోలేని పరిస్థితి ఏర్పడింది. ఋతుపవనాల ప్రభావం వల్ల మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపగా రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు వల్ల వాహనదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.