కాంగ్రెస్ పరిగి మండల అధ్యక్షుడు పి నాగ వర్ధన్

Published: Wednesday May 05, 2021
రాత్రి కర్ఫ్యూ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు నియోజకవర్గం వరకు పూర్తిస్థాయిలో లాక్డౌన్ పెట్టాల్సిందే  
 
పరిగి 4, మే ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ రోజు వందల సంఖ్యలో మరణాలు పెరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తుంది ఇదిలా ఉండగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అధిక మొత్తంలో కోవిడ్ కేసులు అధిక సంఖ్యలో పెరుగుతున్నాయి. రోజు ఎంతో మంది వ్యాధితో మరణిస్తున్నారు గ్రామాలలో పట్టణాలలో కరోనా వ్యాధి వచ్చిన వారు విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా కలిసి ఉండటంతో వారి యొక్క వ్యాధి కుటుంబం మొత్తం విచ్చలవిడిగా వ్యాప్తి చెంది గ్రామ స్థాయిలో అధిక సంఖ్యలో ఎన్నడూ లేని విధంగా కేసులు పెరిగి మరణాల సంఖ్య చాలా వేగంగా మొదలవుతుంది. దీనిపైన ఈ ఒక్క నాయకుడు స్పందన లేదు, ఎంతమంది చస్తున్నా ఎవరు పట్టించుకునే నాథుడు లేడు గ్రామాల్లో ఇంక ముందు ముందు ఇంకా ఏ స్థాయికి దిగజారి పోతుందో అర్థం కావడం లేదు. ఇప్పటికే పరిస్థితి చేజారి పోతుంది నియోజకవర్గ ఒక పెద్ద దిక్కుగా యజమానిగా ప్రజా ప్రతినిధి ఎమ్మెల్యే  ఉన్నారు. ఆయన మన నియోజకవర్గం వరకు శ్రద్ధ తీసుకొని నియోజకవర్గ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపైన ఎంతైనా ఉంది ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో కూడా మీరు స్పందించకుంటే ఇంకా ఏం లాభం మీరు ఏం చేయకుండా పర్వాలేదు కానీ ప్రజల ప్రాణాన్ని కాపాడండి ముందు కరోనా కేసులు తగ్గుముఖం అయ్యేవరకు లాక్ డౌన్ పెట్టండి ప్రజల ప్రాణాల కన్నా ఏది గొప్ప విషయం కాదు గ్రామాలలో వ్యాధిపట్ల అమాయక ప్రజలు బలి అవుతున్నారు ఇప్పటికైనా స్పందించి రోజూ కొంత సమయం సడలింపు ఇస్తూ లాక్డౌన్ పెట్టాల్సింది అన్ని యువజన కాంగ్రెస్ పరిగి మండల అధ్యక్షుడు పి.నాగ వర్ధన్ డిమాండ్ చేసారు. రాత్రి కర్ఫ్యూ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు నియోజకవర్గం వరకు పూర్తిస్థాయిలో లాక్డౌన్ పెట్టాల్సిందే అన్ని యువజన కాంగ్రెస్ పరిగి మండల అధ్యక్షుడు పి నాగ వర్ధన్ తెలియజేసారు.