హాస్టల్ వార్డెన్ విశ్వకుమారికి షోకాజ్ నోటీస్

Published: Tuesday December 20, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 19 డిసెంబర్ ప్రజాపాలన : తాండూరు గిరిజన బాలికల వసతి గృహంలో పిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తున్న హాస్టల్ వార్డెన్ విశ్వకుమారికి షోకాజ్ నోటీస్ జారీచేసినట్లు జిల్లా కలెక్టర్ నిఖిల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజితో విచారణ జరిపించారు.  విచారణలో వాస్తవం తేలినందున జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ హాస్టల్ వార్డెన్ విశ్వకుమారికి షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగిందని  కలెక్టర్ నిఖిల తెలియజేశారు.  ఇద్దరు పార్ట్ టైం ఉద్యోగులను కూడా విధుల నుండి తొలగించినట్లు ఆమె తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం  కాకుండా జాగ్రత్తలు వహించాలని కలెక్టర్ ఆదేశించారు.