ప్రైవేట్ కళాశాలల ఆగడాలకు పై చర్యలు తీసుకోవాలి

Published: Friday September 02, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 01, ప్రజాపాలన: 
 
జిల్లాలోని ప్రైవేట్ కళాశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఐక్య విద్యార్థి సంఘాలుగా జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయ సూపరిండెంట్ కు  గురువారం రోజున వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కళాశాలలు నడపడమే కాకుండా విద్యార్థులను అధిక ఫీజుల పేరుతో మనోవేదన గురి చేస్తున్నారని, భవిష్యత్తులో చదవబోయే డిగ్రీ విద్య కూడా తమ కళాశాలలోనే చదవాలని నిబంధన పెట్టి విద్యార్థులను హింసిస్తున్నారని, అయినా ఈ విషయాలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడం దారుణమని అన్నారు.
ప్రైవేట్ కళాశాలలో ఒకే బిల్డింగులో అటు కళాశాల ఇంకొక పక్క పాఠశాల మరోపక్క వసతి గృహాలు కలిగి ఉన్నయని, కనీస నిబంధనలైనా ఫైర్, గ్రౌండ్ తదితర అంశాలను కూడా పట్టించుకోవడంలేదని, ఈ విషయాలపై విద్యాశాఖ అధికారులు స్పందించి ఈ విద్యా సంవత్సరంలో ఇలాంటి కళాశాలలకు గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తోట రాజేష్, చిప్పకుర్తి శ్రీనివాస్, బచ్చలి ప్రవీణ్ మనోహర్,రామగిరి కుమారస్వామి,జె సిద్ధార్థలు, తదితరులు పాల్గొన్నారు.