గిరి ప్రదక్షిణతో మేధోసంపత్తికి ప్రేరణ * పర్యావరణాన్ని ఆధ్యాత్మికతను పెంపొందించడమే లక్ష్యం

Published: Saturday November 19, 2022

వికారాబాద్ బ్యూరో 18 నవంబర్ ప్రజాపాలన : గిరి ప్రదక్షిణతో ఆధ్యాత్మికతను పెంపొందించడం పర్యావరణాన్ని రక్షించడమే లక్ష్యంగా గిరి ప్రదక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హిందూ జనశక్తి ఆధ్వర్యంలో వికారాబాద్ అనంత గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పర్యావరణం, ఆద్యాత్మికతను, పరిరక్షించేందుకు చేపట్టిన గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రోత్సహించడం ప్రతీ ఒక్కరి భాద్యత అన్నారు. అరుణాచలం గిరి ప్రదక్షణ 12 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి దర్శించుకుంటే ఆనంతుని దివ్యక్షేత్రము చుట్టూ 24 కిలోమీటర్ల పాదయాత్ర భక్తులు చేయడం గొప్ప విషయం అని, దేశంలోనే మొదటి స్థానం లో నిలువడం తెలంగాణ ప్రాంతానికి గర్వకారణం అన్నారు. ఈ ప్రదక్షిణ మొదలు పెట్టిన సదానంద్ రెడ్డి, శ్రీనివాస్, అంజిరెడ్డి, నర్సింహులు ను ప్రతేకంగా అభినందించారు. గత మూడు సంవత్సరాలు గా అనంత గిరి కొండల చుట్టూ ప్రతీ సంవత్సరం నిర్వహించే  అనంతగిరి గిరి ప్రదక్షిణ కు భక్తులు ఈ పాదయాత్ర వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ భవాణీ మాత ఆలయం నుండి ఉదయం 6గంటలకు ప్రారంభమై వికారాబాద్ అనంతగిరి కొండల చుట్టు గోదుమగూడ, జైదుపపల్లి, కెరెల్లి మీదుగా బుగ్గరామేశ్వర ఆలయం నుండి అనంతగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు లలిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం పాదయాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతు మంచి ఆదరణ లభిస్తుందన్నారు . ఈ ఆధ్యాత్మిక పాదయాత్ర వల్ల ప్రతీ ఒక్కరిలో  కొత్త పరివర్తన వస్తుందన్నారు. ఐదు గురు భక్తులతో నాలుగు సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన ఈ కార్యం ప్రతి ఏడు పెరుగుతూ వచ్చింది. మూడు వెలమందితో సాగిన నడకలో, అనంత పద్మనాభ, మాణిక్ ప్రభు నగర్ నవాబ్ పేట్ మహారాజ్ శిష్యులు హిందు బంధువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మెతుకు ఆనంద్  హిందు జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు కె. శ్రీ నివాస్ యాదవ్  బిజెపి వికారాబాద్ జిల్లా అద్యక్షులు సదానంద్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు గోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్, శ్రీదేవి, దుర్గవాహిని రాష్ట్ర కార్యదర్శి సక్కు భాయి, తదితరులు పాల్గొన్నారు.