ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి ఘన సన్మానం

Published: Monday October 11, 2021
మేడిపల్లి, అక్టోబర్10 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న చెరువులు పునరుద్ధరణ, అభివృద్ధి, సుందరీకరణ, మరియు వర్ష ప్రభావం వల్ల చెరువు పరిసర లోతట్టు ప్రాంతాలు ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం నుండి కోట్లాది ధనాన్ని మంజూరి అయ్యేవిధంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావించినందుకుగాను ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నందుకు రామంతపూర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గరిక సుధాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి శాలువా కప్పి గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ  కార్యక్రమంలో రామంతాపూర్ డివిజన్ టీఆర్ఎస్  అధ్యక్షుడు ఎం.డీ. ముస్తాక్, టీఆర్ఎస్ యూత్ నాయకులు శ్రీకాంత్ గౌడ్, రామంతపూర్ ఇంద్ర నగర్ యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.