ఫోటోగ్రఫీ రంగంలో ఫోటో గ్రాఫర్స్ ను ప్రభుత్వం ఆదుకోవాలి : వ్యవస్త రక్షణలో విలువైన పాత్ర పోషిం

Published: Friday August 20, 2021
మధిర, ఆగస్టు 19, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో ఫోటో గ్రాఫ్ఎన్నో విలువైన జ్ఞాపకాలను మన కళ్ల ముందు ఉంచేది ఒక ఫోటో మాత్రమేప్రపంచ ఫోటో గ్రాఫర్స్ కార్మికులకు ఫోటోగ్రఫీ శుభాకాంక్షలుచిలివేరు సాంబశివరావు జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఈరోజు అంతర్జాతీయ ఫోటో గ్రాఫర్స్ వేడుకలను మధిరలో యూనియన్ ప్రధాన కార్యదర్శి యడవల్లి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. కెమెరా సృష్టి కర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమావేసి నివాళులు అర్పించారు. ఇటీవల మిత్రుడు మధిర మండల అసోసియేషన్ అధ్యక్షులు గోకర్ల చంద్రం  మరణించటం జరిగింది వారిని స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించటం జరిగినది అనంతరం వారి సతీమణి గోకర్ల పార్వతి గారు సేవాసధనం లో పిల్లలకు పండ్లు ఇవ్వటం జరిగినది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ చదువుకొని ప్రభుత్వ కొలువులు లేక ఫోటో గ్రఫీ వృత్తిని ఎంచుకున్నారు. ప్రభుత్వం గుర్తించి వారిని ఆడుకోవాలని, వారికీ మెరుగైన సాంకేతిక పరికరాలు అందించి ఆర్థికoగా ఆదుకోవాలని, ఇల్లు లేని వారికీ గృహాలు మంజూరు చెయ్యాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫోటో గ్రాఫర్స్ యడవల్లి నాగభూషణం, వైకుంఠం, బిక్కి లక్ష్మణ్, ఆదూరి విజయ్, పెండ్యాల బిక్షం, జగన్, కాకాని సంగయ్య, తదితరులు పాల్గొన్నారు.