మార్కెట్ యార్డ్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.

Published: Saturday October 01, 2022

 మధిర సెప్టెంబర్ 30 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు స్థానిక మార్కెట్ యార్డ్ లో మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా మధిర మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తా రు నాగేశ్వరరావు  ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తా రు నాగేశ్వరరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో బతుకమ్మ పండుగ ఎంతో గొప్పదని ఈ పండగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు.అనంతరం పెద్ద బతుకమ్మను ఏర్పాటు చేసి ఆ బతుకమ్మ చుట్టు కోలాటాలతో పాటలు పాడుతూ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ లక్ష్మణరావు సూపర్వైజర్ జగదీష్ టీఆర్ఎస్ మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, రాజా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.