ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలినీ : అందెల

Published: Tuesday April 06, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజా పాలన : వృద్ధులు, చిన్నారులు మధ్యాహ్నం బయటకు రావొద్దు. కరోనా వైరస్ కట్టడికి స్వీయ నియంత్రణే మేలు - అందెల పేర్కొన్నారు. బడంగ్ పేట్  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామంలో సోమవారం నాడు  మెయిన్ రోడ్డులో మజ్జిగ, చలివేంద్రం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బిజెపి మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జి అందెల శ్రీ రాములు యాదవ్, కార్పొరేషన్ 9 వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ కలిసి ప్రారంభించారు. వేసవి కాలం ప్రారంభం కావటంతో మజ్జిగ, చలివేంద్రాలను చిరు వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు సామాజిక బాధ్యతగా ప్రారంభిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా అందెల శ్రీరాములు మాట్లాడుతూ..  వాహనదారులు వేసవి తాపనికి గురి కాకుండా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం హర్షనీయమని చిరు వ్యాపారులను అభినందించారు. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని... ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున్న ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్లు తప్పకుండా వాడాలని విజ్ఞప్తి చేశారు శ్రీరాములు యాదవ్. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి, గుడెపు ఇంద్రాసేన, మాజీ కౌన్సిలర్ మమతా సుదర్శన్ రెడ్డి, పోరెడ్డి జగన్ మోహన్, దేవేందర్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు రాళ్లగుడెం రామకృష్ణారెడ్డి, మంత్రి మహేష్ ముదిరాజ్, జగన్ ముదిరాజ్, జంగారెడ్డి, ఐలయ్య, తోట అరవింద్ రెడ్డి, రవికాంత్ గౌడ్, సంజీవ్, అనిల్ గౌడ్ సహా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన వ్యాపారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు