జోగన్ పల్లి గ్రామన్ని సందర్శించిన స్టేట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్స్

Published: Friday July 09, 2021
ఆర్.ఎస్.వి ప్రసాద్ మరియు నరేష్
కోరుట్ల, జూలై 08 (ప్రజాపాలన ప్రతినిధి) : పల్లె ప్రగతి లో భాగంగా గురువారం రోజున జోగన్ పల్లి గ్రామంలో స్టేట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ఆర్.ఎస్.వి ప్రసాద్ మరియు జిల్లా పంచాయితీ అధికారి నరేష్ లు సందర్శించారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, ప్రభుత్వ పాఠశాల, కంపోస్టు షెడ్, నర్సరీ, వైకుంఠధామం శానిటేషన్కు సంబంధించిన వాటినీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజా నర్సయ్య తెలిపారు. శిధిలావస్థలో ఉన్న పంచాయతి భవనాన్ని పరిశీలించి సత్వరమే నూతన బిల్డింగ్ కు జిల్లా పంచాయతీ రాజ్. ఈ మంజూరు కొరకు ప్రపోజల్స్ పంపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, ఈసీ దిపిక, గ్రామ కార్యదర్శి హాకిం, కారోబార్ అంజయ్య మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది