ఎరువులు అత్యధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు

Published: Friday December 18, 2020
  • జిల్లా కలెక్టర్, జిల్లా జాతీయ ఆహార భద్రత పథకం చైర్మన్ భారతి హోళ్ళికేరి.

  • మంచిర్యాల జిల్లా ప్రతినిధి,డిసెంబర్ 16, ప్రజాపాలన.

జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకము కలిగిన రైతుల భూములకు సరిపడేంత మాత్రమే ఎరువులు విక్రయించాలని అధికంగా విక్రయించినట్లయితే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో జిల్లా అధికారులతో జాతీయ ఆహార భద్రత పథకం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత పథకం న్యూట్రి సీరియల్స్ కోసం రూపొందించిన కార్యచరణ ప్రణాళికను ఆమోదించడం జరిగిందని ఇందులో భాగంగా పురుగుల మందుల వినియోగంపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భూములకు సరిపడా జింక్ సల్ఫేట్ రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు పంట సాగులో మోతాదుకు మించి ఎరువులు వినియోగింరాదని, పట్టాదారు పాసు పుస్తకము మీద ఉన్న భూమికి సరిపడా మాత్రమే డీలర్లు ఎరువులు ఇవ్వాలని, రైతులు కూడా అవసరం మేరకు మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలని, ఈ-పాన్ మిషన్ ద్వారా ఎరువులు రైతులకు విక్రయించాలని తెలిపారు. ఎరువులు అధికంగా వినియోగించిన రైతులు, విక్రయించిన డీలర్లపై విచారణ చేయడం జరిగిందని, నిబంధనలు అతిక్రయించిన వారిపై తగు చర్యలు తీసుకోవడంతో పాటు ఎరువుల డీలర్ల లైసెన్స్లు సస్పెన్షన్ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్య, జిల్లా ఉద్యానవన, పట్టు శాఖ అధికారి యుగంధర్ జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి శంకర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలిరాజు, వ్యవసాయ అధికారి (సాంకేతిక) అత్తె సుధాకర్, కవిత, కృషి విజ్ఞాన శాస్త్రవేత్త నాగరాజు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.