కార్మికుల పిఎఫ్ సమస్యలను పరిష్కరించాలి పిఎఫ్ కార్యాలయం ముందు సీఐటీయూ కార్మికుల ధర్నా

Published: Thursday July 07, 2022
కరీంనగర్ జూలై 6 ప్రజాపాలన ప్రతినిధి :
మున్సిపల్ కార్మికుల పిఎఫ్ ఖాతాల్లో  దొర్లిన తప్పులను ఆధార్ కార్డు లో ఉన్నట్టుగా సవరణ చేయాలని  స్థానిక  పిఎఫ్ కార్యాలయం ముందు మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ బుధవారం నాడు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం పిఎఫ్ డిప్యూటీ కమీషనర్ తనయ్య కు వినతి పత్రాన్ని అందజేశారు..అయన కేంద్రం అనుమతి కోసం లేఖ రాస్తానని తెలియ చేశారు.
 
 సిఐటియూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్,యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు గిట్ల ముకుంద రెడ్డి లు ఈ సందర్బంగా మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పని చేస్తున్న కార్మికుల పిఎఫ్ ఆన్లైన్ పేర్లలో తప్పులను, పుట్టిన తేదీ లను, జాయినింగ్ తేదీలను,ఇప్పటికే కార్మికులు నెట్ సెంటర్స్ లో చేపించుకుంటున్నారని, అనేక సార్లు ఈ కే వై సీ ఫారంల ద్వారా మున్సిపల్ ఆఫీస్ ద్వారా చేపించంటం జరిగిందన్నారు.అయినా ఈ కే వై సీ ద్వార నమోదు చెప్పినప్పటికీ తప్పులు ఉన్నాయని,ఇప్పటికే కొంత మంది కార్మికుల ఈ కే వై సీ ఫార్మ్ తిరిగి మున్సిపల్ ఆఫీస్ కి పంపిస్తున్నారని, ఇలా చేయటం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆధార్ ఉన్నటు కార్మికుల్లో పిఎఫ్ ఖాతాలో నమోదు చేయాలని పిఎఫ్ అధికారులకు మొర పెట్టుకున్నప్పటికి దీనికి పాస్ పోర్ట్ జత చేయాలని చెప్పగా , పాస్ పోర్ట్ జత చేసిన తిరిగి మున్సిపల్ ఆఫీస్ కి పంపిస్తున్నారు. ఎక్కువ మంది కార్మికులు చదువు లేనివారు  ఉన్నారు. ఆధార్ కార్డు ఆన్ని ప్రభుత్వ పథకాలకు వర్తిస్తుంది అని చెప్పిన పాలకులు ఇలా కార్మికులను ఆఫీస్ వెంట తిప్పుకోవతము భావ్యం కాదని,వెంటనే ఆధార్ కార్డు ప్రకారం పిఎఫ్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేనిచో భవిష్యత్తు నిధి కార్యలయం ముందు నిరంతర ఆందోళనా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్  ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జనగాం రజమల్లు,యూనియన్ జిల్లా అధ్యక్షుడు అషోధా రవీందర్,నాయకులు కంపెల్లి పోచయ్య, కవ్వం పెళ్ళి రవి, తపట్ల శంకరమ్మ,బుజ్జమ్మ, ఉపేందర్,లక్ష్మి,లత,మలేశం, కృష్ణ మూర్తి,గంగయ్య తదితరులు పాల్గొన్నారు.