గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాం ఎంపీటీసీ 2 అనసూయ

Published: Friday July 01, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 30ప్రజాపాలన ప్రతినిధి.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామ ఎంపీటీసీ 2 పిట్టల అనసూయ సీతయ్య, పదిలక్షల రూపాయల ఎంపీపీ నిధుల నుండి అండర్  డ్రైనేజ్, ఎస్సీ సీసీ రోడ్స్  బస్తి కురుమ బస్తి నెర్రపల్లి పాఠశాలలో  మౌలిక వసతులు చేకూర్చారు. నేర్ర పల్లి గ్రామానికి ఎంపీటీసీ సొంత ఖర్చుతో వాటర్ ట్యాంకర్లను, మంచినీరు ఫిల్టర్ వాటర్ నేర్ర పల్లి కాంగ్రెస్ పార్టీ  గ్రామ శాఖ కార్యకర్తల సహకారంతో ప్రతి ఇంటికి సరఫరా చేస్తున్నామని ఎంపీటీసీ అనసూయ సీతయ్య తెలిపారు. దండు మైలారం నెర్రపల్లి రెండు గ్రామపంచాయతీలో కలిపి పది లక్షల నిధులు ఖర్చు చేశామని వివరించారు. జడ్పిటిసి నిధులు రెండున్నర లక్షలు మంజూరైనట్టు, మా గ్రామం పెద్దది అయినందున జెడ్పిటిసి ని కోరగా ఇంకా ఐదు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఎంపీటీసీ పిట్టల అనసూయ సీతయ్య తెలియజేశారు.