పారిశుధ్యం పై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలి - జిల్లా కలెక్టర్ గుగులోతు

Published: Tuesday July 19, 2022

రాయికల్, జూలై 18 (ప్రజపాలన ప్రతినిధి): పారిశుద్ధ్యం పై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ గుగులోతు రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పలు ప్రాంతాలలోపర్యటించి పరిస్థితులను పర్యవేక్షించారు. భారీ వర్షాల కారణంగా పట్టణంలోఅపరిశుభ్రత ఉందని,వర్షాలుతగ్గిన తర్వాత వ్యాధులు ప్రబలేప్రమాదంఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని భారీవర్షాలకారణంగా గుంతలలో,మురుగునీటి కాలువలలోదోమలు ప్రబలకుండా యాంటి లార్వా స్ప్రే చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని,వైద్యసిబ్బంది పట్టణంలో ఇంటింటికివెళ్లి సర్వే చేయాలని ఆదేశించారు. దోమలు వ్యాప్తిచెందకుండా కట్టుదిట్టమైనచర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పట్టణంలోని మాదిగకుంటను, వర్షాలకు కూలిపోయిన ఇండ్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ అరుణశ్రీ,జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి శ్రీధర్,జిల్లా పంచాయతీఅధికారి హరికిషన్,రాయికల్ తాసిల్దార్ దిలీప్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ మోర హనుమాన్లు,వైస్ పర్సన్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్,పట్టణ వార్డు కౌన్సిలర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.