రాష్ట్ర నీటిపారుదల సలహాదారు పెంటారెడ్డి జన్మదిన వేడుకలు

Published: Monday April 05, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 4 ( ప్రజాపాలన ) : హైదరాబాద్ లోని తన స్వగృహంలో రాష్ట్ర నీటి పారుదల సలహాదారు పెంటారెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి  అభినందనలు తెలియజేశారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సాగునీటి కోసం చేేసిన కృషి అనిర్వచనీయమని కొనియాడారు. సాగునీటిని పంటపొలాలకు అందించేందుకు అపర భగీరథ ప్రయత్నం చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులతో పాటు మాజీ మండల విద్యాధికారి వెంకట్ రెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సోమిరెడ్డి, కేరెల్లి గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి మాజీ పిఎసిఎస్ చైర్మన్ మాణిక్ రెడ్డి, వైద్యులు కవితా వెంకట నర్సింహారెడ్డి,  ఇంజనీర్లు కార్తీక్  తదితరులు పాల్గొన్నారు.