అత్యుత్తమ పౌష్టికాహారం బిడ్డకు తల్లిపాలే: ఏ సి డి పి ఓ కమల ప్రియ

Published: Thursday August 04, 2022
బోనకల్, ఆగస్టు 3 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామంలో బుధవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్, ఎ సి డి పి ఓ కమల ప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమల ప్రియ మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం అన్నారు. డబ్బా పాలు వద్దు తల్లి పాలు ముద్దని, పుట్టిన వెంటనే గంటలోపు బిడ్డకు ముర్రుపాలు తాగించడం వలన వ్యాధి నిరోధక శక్తి పెంపొందించబడుతుందన్నారు. ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ పౌష్టికాహారం బిడ్డకు తల్లిపాలే అని, తల్లిపాల వల్ల బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఏ సి డి పి ఓ కమల ప్రియ అన్నారు.అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి, వైద్యాధికారి సాయి ప్రియాంక, అంగన్వాడి టీచర్లు రాజ్యలక్ష్మి పద్మ, నిర్మల, అనిత, శైలజ తదితరులు పాల్గొన్నారు.