కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేద్దాం. -ఘనంగా ఎమ్మార్పీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవ

Published: Friday July 08, 2022

భద్రాద్రి కొత్తగూడెం(ప్రజాపాలన బ్యూరో)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండల కేంద్రంలోని ఏ యంసి కాలనీ,జగదీష్ కాలనీ,లంబాడి కాలనీ,సుభాష్ నగర్ కాలనీ,భూపతి రావు కాలనీలలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణలు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించడం జరిగింది.ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ విద్యాసాగర్,ఎమ్మెస్సీ పార్టీ పట్టణ కన్వీనర్ బొడ్డు సత్యనారాయణ  మాట్లాడుతూ....ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యానికి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాదిగ,మాదిగ ఉప కులాలు  పోరాటం మరింత ఉధృతం చేయాలని అన్నారు.1994 జులై 7న ప్రకాశం జిల్లా ఈదుముడు గ్రామంలో ప్రారంభమైన మాదిగ దండోరా ఉద్యమం మాదిగ,మాదిగ ఉప కులాల అస్తిత్వం ఆత్మగౌరవం హక్కుల సాధన దిశగా పోరాటం చేస్తుందని,ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం గత 28 సంవత్సరాలుగా మణి శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేసిన విషయం అందరికీ తెలిసిందేనని, ఎమ్మార్పీఎస్ ఉద్యమం తమ జాతి హక్కుల కోసం ఏర్పడిన తమ జాతి హక్కుల కోసం పోరాటం చేస్తూనే సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడి పోరాటం చేసి అనేక పథకాల సాధించి మాదిగ జాతి ఉద్యమం మానవజాతి ఉద్యమంగా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు.మాదిగలకు ఆత్మగౌరవం గుర్తింపుతో పాటు 1997_2000 సంవత్సరంలో రెండుసార్లు ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగిందని,2000 సంవత్సరం సాధించిన వర్గీకరణ 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు జరగడం వలన 23 వేల ఉద్యోగాలతో పాటు విద్య అవకాశాలు గణనీయంగా పొందడం జరిగిందని,ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కొరకు పోరాడి సాధించడం జరిగిందని,గుండె జబ్బుల పిల్లల కొరకు పోరాడి ఆరోగ్య శ్రీ పథకం సాధించడం జరిగిందని,వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఫిక్షన్  పెంపు పోరాడి సాధించిందని,రేషన్ షాపుల ద్వారా ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యం పెంచేల పోరాడి సాధించిందని,ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రద్దు కాబడితే ఢిల్లీ నుండి గల్లీ దాకా పోరాటం చేసి యధావిధిగా కొనసాగిన సాధించిందని,మహిళల మీద అత్యాచారాలకు పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించడానికి 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టు ను సాధించిందని,మహా జననేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగా 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల సంక్షేమం కోసం వాళ్ల హక్కుల కోసం ఆత్మగౌరం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని గుర్తు వారు చేశారు.రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పట్ల మాదిగలను మోసం చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ప్రతి గ్రామంలో నిలదీయాలని అన్నారు.వందరోజుల వర్గీకరణ చేస్తానన్న మోసకారి బిజెపి ప్రభుత్వాన్ని ప్రతిఘటించేందుకు మాదిగ,మాదిగ ఉప కులాల యువత సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్ట్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం కోఆర్డినేటర్ అలవాల రాజా పెరియర్,కో కన్వీనర్స్ కొమ్మగిరి వెంకటేశ్వర్లు ఉంగుటూరు వీర రాఘవులు,కోట ప్రభాకర్,బొక్క రాంబాబు,తోకల దుర్గాప్రసాద్,కోట రవి,పట్టణ కమిటీ నాయకులు గంజి చంటి,కొత్తపల్లి బాలకృష్ణ,పింగిలి నాగరాజు,పొట్ట పింజర ప్రకాష్,ముయ్యటి శివ,సతీష్, సంతోష్,లోకేష్,చీరాల పార్వతి,సత్యవతి,అక్కల ప్రసాద్ నరసింహారావు,కేశవ,సుబ్రహ్మణ్యం, నాగరాజు,వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు