ఇబ్రహీంపట్నం పిబ్రవరి తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి *ఇళ్ల స్థలాల సాధనకై ఫిబ్రవరి 9న ఇందిరాపార

Published: Saturday February 04, 2023

ప్రజా సంఘాల  పోరాట వేదిక రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా  తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఉన్న ఇబ్రహీంపట్నం ఆర్డిఓ కార్యాలయం ముందు ఈరోజు తుర్కయంజాల్ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలందరిరు   పెద్ద ఎత్తున ధర్నా చేసి సూపరింటెండెంట్ శ్రీమతి అమర జ్యోతి గారికి మెమొరాండం మరియు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రజాసంఘాల పోరాట వేదిక రంగారెడ్డి జిల్లా నాయకులు, మంచాల మండల మాజీ జెడ్పిటిసి పగడాల యాదయ్య  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ పేదలకు ఇచ్చిన హామీలను టిఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదు, పేదలకు ఇచ్చిన హామీలైన డబల్ బెడ్ రూమ్స్ ఇస్తామని, ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాలని, ఇంటి స్థలం ఉన్నవారికి ఇల్లు తట్టుకోవడానికి రూ.3లక్షలు కాకుండా కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.అనంతరం  సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు డి కిషన్ మాట్లాడుతూ  తుర్కయంజాల్ మున్సిపల్ ప్రాంతం హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి  జీవనోపాధి కోసం వేలాది కుటుంబాలు వలస వచ్చి జీవనం కొనసాగిస్తున్నారని అదేవిధంగా వారి కుటుంబాలు పెద్ద ఎత్తున విస్తరించాయని అన్నారు ఇలాంటి నిరుపేదలు ఇండ్లకు రాయి కట్టుకోలేక అనేక సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఇలాంటి వారిని గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు అదేవిధంగా తుర్కయంజాల్ మున్సిపల్ ప్రాంతంలోని అనేక మంది స్థానిక నిరుపేదలు కూడా ఇల్లు ఇందు స్థలం లేక అత్యంత దీనమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఇటువంటివారిని అందర్నీ ప్రభుత్వం గుర్తించి అర్జీ పెట్టుకున్న వారందరికీ పక్కా గృహాలను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఈరోజు జరిగిన ప్రజా సంఘాల పోరాటా వేదిక ఆధ్వర్యంలో వందలాదిమంది నిరుపేదలు దరఖాస్తులు పెట్టుకున్నారని వెంటనే ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్  కారత్,ఐద్వా జిల్లా కార్యదర్శి సుమలత, స్థానిక నాయకులు టీ, నర్సింహ, ఐ భాస్కర్ , కె.వెంకట కృష్ణ , బి శంకరయ్య, కొండి గారి శంకర్, ఐ.కృష్ణ ,మలాద్రి,రత్నమ్మ,శారదా, యాదగిరి, శివ ప్రసాద్ గౌడ్, అజయ్ గౌడ్, ఆంజనేయులు, శ్రీను నాయక్ ,ఉమా, స్వప్న,  ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.