వినికిడి బుద్ధిమాంద్యం కిట్స్ పంపిణీ : జిల్లా విద్యాధికారిణి రేణుక దేవి

Published: Saturday October 02, 2021
వికారాబాద్ బ్యూరో 01 అక్టోబర్ ప్రజాపాలన : వినికిడి బుద్ధిమాంద్యం విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేశామని జిల్లా విద్యాధికారిణి రేణుకాదేవి అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో వినికిడి లోపం గల విద్యార్థులకు వినికిడి యంత్రాలను మరియు బుద్ధిమాంద్యం గల విద్యార్థులకు బుద్ధిమాంద్యం కిట్స్ ను రాష్ట్ర సమగ్ర శిక్ష తరఫున జిల్లా విద్యాధికారి శ్రీమతి జి రేణుక దేవి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారిణి రేణుక దేవి మాట్లాడుతూ ఈ పరికరాలు వినికిడి మరియు బుద్ధిమాంద్యం గల విద్యార్థులకు చాలా ఉపయోగపడతాయని తెలిపినారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు పై ఉపకరణాలు మీ విద్యార్థులు నిత్యం వాడే విధంగా చూడాలని తెలపడం జరిగింది. వారిలో ఆత్మస్థైర్యం నింపాలని వారు కూడా ఉన్నత చదువులు చదివి వారి భవిష్యత్తు బాగా ఉండే విధంగా చూడాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సమ్మిళిత విద్య సమన్వయకర్త జి. రవి,  వికారాబాద్ మండల విద్యాధికారి బాబు, జిల్లాలోని సమ్మిళిత విద్య రిసోర్స్ పర్సన్స్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.