అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం

Published: Monday April 11, 2022
పాలేరు ఏప్రిల్ 10 ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని మునిగేపల్లి గ్రామం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాములోరి కళ్యాణాన్ని రమణీయంగా చేయాలని నిర్ణయించడమే కాక.. మిగిలిన గ్రామాలకు భిన్నంగా కళ్యాణం నిర్వహించారు. అన్ని వర్గాలను కలుపుకొని పోతూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గతంలో కొద్ది మందితో సాదా, సీదాగా నిర్వహించిన  రాములోరి కళ్యాణం నేడు అందరికీ అవకాశం కల్పించారు ఆ ఊరి పెద్దాయన, టిఆర్ఎస్ జిల్లా నాయకులు రామా శ్రీను అన్ని కులాలను భాగస్వామ్యం చేసి నిజమైన రాముల వారి కళ్యాణం నిర్వహిస్తుండటంతో ఇప్పుడు ఆ గ్రామ ప్రజల్లో ఉత్సాహం కనిపిస్తోంది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ సీతారాముల కల్యాణ మహోత్సవం ఈ కళ్యాణం లో పాల్గొని తరలించి పోయారు. 11 జంటలు పీటలపై కూర్చోని రాములోరి కళ్యాణం నిర్వహించారు. రామా శ్రీను దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సన్నిధిలో మహా అన్న దానం నిర్వహించారు. గత 30 ఏళ్ల క్రితం ఏ విధంగా ఐతే శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించారో అదే విధంగా ఇప్పుడు జరిగిందంటూ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగ్గిళ్లు మోహన్, ఉపసర్పంచ్ మొక్క శ్రీను, నెల్లూరు శేషగిరి, జొన్నలగడ్డ రవికుమార్, రామా నాగేశ్వరరావు, రామా రాంబాబు, రామా పూర్ణ తదితరులు పాల్గొన్నారు.