డ్వాక్రా మహిళలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Published: Thursday June 17, 2021

పటాన్చెరు, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : కోవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలవారికి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ద్వాక్రా మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు ఫ్రంట్లైన్ వారియర్స్, హై రిస్కు గ్రూప్స్, 45 సంవత్సరాలు నిండిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ అందించడంతో పాటు ప్రైవేట్ ఆస్పత్రిలోనూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మూలంగా కరోనా నియంత్రణలో ఉందని తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. డ్వాక్రా మహిళలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు