సిపిఎం పార్టీలో అంకితభావంతో పనిచేసిన నాయకుడు లావూరి బిక్షం మృతదేహానికి పార్టీ జెండా కప్పి

Published: Monday August 08, 2022

బోనకల్, ఆగస్టు 7 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామ తూర్పు తండా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు లావూరి బిక్షం (78) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బిక్షం మృతదేహానికి మండల సిపిఎం పార్టీ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు పంతు, గ్రామ సిపిఎం నాయకులు సందర్శించి పార్టీ జండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరావు మాట్లాడుతూ బిక్షం తూర్పు తండా కుల నాయకుడిగా పనిచేసి సిపిఎం పార్టీలో మచ్చలేని నాయకుడిగా చురుకైన పాత్ర పోషించి గ్రామంలో అనేక విషయాల్లో, వివిధ సందర్భాల్లో సేవలు చేసి, సిపిఎం పార్టీలో అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త లావూరి బిక్షం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ లావూరీ వెంకటేశ్వర్లు, రావినూతల గ్రామ సహకార సంఘం సభ్యులు, సిపిఎం సీనియర్ నాయకులు కొంగర గోపి, అజ్మీర బాబులు, యుటిఎఫ్ మండల కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, సిపిఎం నాయకులు భూక్యా కృష్ణ, గిరిజన సంఘం మండల అధ్యక్షులు భూక్యా శ్రీను, గిరిజన సంఘం మండల కార్యదర్శి అజ్మీరా గోపి, రావినూతల గ్రామ ఉపసర్పంచ్ బోయినపల్లి కొండలు, అఫ్జల్, ఎరగాని నాగరాజు, ఎరగాని నాగేశ్వరరావు, కొమ్మినేని పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు