బందీగా ఉన్న మా అక్కను విడిపించండి

Published: Wednesday January 19, 2022
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు
న్యాయం చేయాలని రాచకొండ సిపికి బాధితుల వేడుకోలు 
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : అనారోగ్యంతో ఉన్న తమ అక్క ను ను బలవంతంగా తీసుకెళ్లి నానా చిత్రహింసలు పెడుతున్నారని.. బందీగా ఉన్న తమ అక్క ను విడిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అక్క కోసం తమ తల్లి దేవకి మానసిక వేదనతో మంచాన పడిందని వెంటనే  రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ముగ్గురు కుమార్తెలు అంజలి, రాజేశ్వరి, అమరావతి మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈసీఐఎల్ లో ఉద్యోగ విరమణ పొందిన తమ పెద్దక్క సెల్వకుమారి తల్లితో పాటు తిరుమలగిరి లోని సరస్వతి నగర్ లో తమతో ఉండేదని.. గత సంవత్సరం నవంబర్ 29న తమకు తెలియకుండా యాప్రాల్ లో ఉండే రెండవ అక్క ముత్తు లక్ష్మి, ఆమె కుమారుడు, ఆమె భర్త బలవంతంగా తమ పెద్దక్క సెల్వ కుమారిని తీసుకు వెళ్లి గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమాచారం ఇరుగుపొరుగు వారి ద్వారా తమకు తమ పెద్దక్క తెలియజేసిందిందని.. వెంటనే అక్కను రక్షించేందుకు వెళ్లగా తమ రెండవ అక్క భర్త, కుమారుడు కలసి తమపై దాడి చేశారన్నారు. వెంటనే సమీపంలో ఉన్న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా తన వెనకాలే వచ్చిన రెండవ అక్క కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట వేచి చూస్తున్న తన చెల్లెలు, కుమార్తె పై కానిస్టేబుల్ ముందే దాడి చేశారనిఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఐ చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లగా ఫిర్యాదు ఇవ్వాలని చెప్పగా సీఐ సూచన మేరకు ఫిర్యాదు చేశామన్నారు. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ఈ విషయంపై ప్రశ్నించగా తమ అక్కను విడిపించడం మాట అటుంచితే తమపైనే కిడ్నాప్ కేసు పెడతానని హెచ్చరించానని పేర్కొన్నారు. ఇకపోతే తమకు కనీసం రసీదు పత్రం కూడా ఇవ్వలేదని తాము ఇచ్చిన ఫిర్యాదు వాపస్ ఇవ్వాలని వేడుకున్న కనికరించలేదన్నారు. పైగా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్లాలని హెచ్చరించారని పేర్కోన్నారు. దీనంతటికి కారణం తమ పెద్ద అక్క పేరు పై ఉన్న 200 గజాల స్థలం 33 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు కారణమన్నారు. వీటిని మొత్తం కాజేసేందుకు నేరప్రవృత్తి ఉన్న తమ రెండవ అక్క కుమారుడు అలాగే ఆమె భర్త ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఆ డబ్బు స్థలం మాకు అక్కరలేదని తన అక్కను సురక్షితంగా అప్పగిస్తే చాలని కోరుతున్నారు. ఈ విషయంపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.