మధిర నియోజకవర్గానికి దళిత బంధుపైలెట్ ప్రాజెక్టు కింద చింతకాని... సీఎం చిత్రపటానికి పాలాభిషే

Published: Thursday September 02, 2021

మధిర, సెప్టెంబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీరాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల సంక్షేమం అభివృద్ధే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టు కింద మధిర నియోజకవర్గం లోని చింతకాని మండలం ని ఎంపిక చేశారు. ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రాన్ని ఉప ఎన్నిక నేపథ్యంలో పథకం అమలు ప్రారంభించిన ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును తొలివిడతగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఎస్సీ నియోజకవర్గo అయిన మధిర సెగ్మెంట్ లోని చింతకాని మండలం సూర్యాపేట జిల్లా లోని తిరుమలగిరి నాగర్ కర్నూలు జిల్లాలోని చార గుండా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం ను తొలిదశ దళిత బంధు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటన వెలువడిన నేపథ్యంలో మధిర నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో తెరాస శ్రేణులు దళిత సామాజిక వర్గాల యువత హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. చింతకాని మండల పరిధిలోని అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు చేయనున్నట్లు, ఆ తర్వాత మండలాల వారీగా ఈ పథకం అమలు ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూపాయలు పది లక్షలను అందించడం జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. కాగా మధిర నియోజకవర్గానికి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు కాగా సీఎం ప్రకటన ఈ నేపథ్యంలో మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆ క్రమంలోనే సీఎం కేసీఆర్ చిత్రపటానికి తెరాస శ్రేణులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల బాధ్యులు దేవిశెట్టి రంగ, ఆరిగే శ్రీను, రావూరి శ్రీను, బొగ్గుల భాస్కర్ రెడ్డి, amc చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, రైతుబందు కన్వీనర్ చావా వేణుబాబు, మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత ఎంపీపీ మెండెం లలిత కౌన్సిలర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు హాజరయ్యారు.