కుక్కిందలో 6వ వార్డులో నల్లా కనెక్షన్లు ఇవ్వాలి

Published: Friday December 23, 2022
 మరుగుదొడ్ల బిల్లులు చెల్లించాలి
* అసంక్రమిక వ్యాధులపట్ల జాగ్రత్త తిసుకోవాలి
* మీతో నేను కార్యక్రమంలో భాగంగా కుక్కిందలో పర్యటించిన ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్ బ్యూరో 22 డీసెంబర్ ప్రజాపాలన : కుక్కింద గ్రామంలోని 6వ వార్డు ప్రజలకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని తెలిపారు. గురువారం ధారూర్ మండల పరిధిలోని కుక్కింద గ్రామంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కారంజి వీరేశం ఉపసర్పంచ్ గట్టేపల్లి బుగ్గమ్మ ఫకీరప్ప పంచాయతీ కార్యదర్శి దోనూరు శిల్పతో కలిసి వీధి వీధి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
మిషన్ భగీరథ త్రాగునీటిలో తగిన మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలపాలన్నారు.  గ్రామంలో పాడుబడ్డ ఇళ్లను, పిచ్చిమొక్కలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శి శిల్పకు సూచించారు. కుక్కింద గ్రామంలో అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలు అమర్చాలని వెల్లడించారు. గ్రామంలో, పంట పొలాలలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని చెప్పారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను మంజూరు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. నాన్ కమ్యూనకబుల్ డిసీజ్ (NCD) షుగర్, బీపీ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ త్రాగునీటిలో ట్యాంకు నిండినప్పుడు బ్లీచింగ్ పౌడర్ కలిపేలా... చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని, వాడుకలో ఉంచుకోవాలన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు ఆమోదించడానికి గెజిటెడ్ సంతకానికి లంచం తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు బంధు పథకం కింద కుక్కింద గ్రామానికి
4 కోట్ల రూపాయలు మంజూరు అవడం విశేషమని ప్రశంసించారు. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టారని వివరించారు. మహిళల రక్షణకు షీ టీంలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. మా ఇంటికి ఒక్క సంక్షేమ పథకం కూడా రాలేదని సభాముఖంగా చెప్పాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద సవాల్ విసిరారు. భూత వైద్యుని ద్వారా తీవ్ర గాయాల పాలైన అశ్విని వైద్య చికిత్స కొరకు 16 లక్షల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. పక్షవాతం నూటికి 99 శాతం బిపితో వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో అయోగ్నటిక్ పరీక్షలు నిర్వహించే ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. గ్రామంలో 184 మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయని అన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జనకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. కుక్కింద గ్రామాభివృద్ధికి 7 లక్షల రూపాయలు మంజూరు చేశారు. వికారాబాద్ నియోజకవర్గంలోని మొత్తం 131 గ్రామాలలో చేపట్టిన మీతో నేను కార్యక్రమంలో భాగంగా 115వ గ్రామం కుక్కింద అని వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్ పిటిసి
కోస్నం సుజాత వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రారంజి వీరేశం, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు రుద్రారం వెంకటయ్య ముదిరాజ్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కావలి అంజయ్య ముదిరాజ్, రాజు గుప్తా, మండల ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు,
 ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.