బ్యాంక్ ఖాతాదారులు తప్పకుండ భీమా చేయించుకోవాలి...

Published: Tuesday March 09, 2021
బీరుపూర్, మార్చి 08 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలం చర్లపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారులు మాట్లాడుతూ గ్రామీణ బ్యాంక్ లో ఉన్న ఖాతదారులు తప్పకుండ పీఎం జీవన్ జ్యోతి భీమా యోజన పథకంలో ప్రతిఒక్క ఖాతాదారుడు సంవత్సరంలో 330 రూపాయలు చెల్లిస్తే సాధారణ మరణ భిమాకు 2 లక్షలు మరియు పీఎం సురక్ష భీమా యోజన పథకం సంవత్సరంలో 12 రూపాయలు చెల్లిస్తే ప్రమాదం జరిగినటైయితే 2 లక్షల భీమా వర్తిస్తదని రూపే ఏటిఎం కార్డ్ 45 రోజులలో ఒక్కసారిగా వాడిన ఏదైనా ప్రమాదం జరిగిన 2 లక్షల భీమా వర్తిస్తాదని బ్యాంక్ అధికారులు సూచించారు. ఈ సమావేశంలో బ్యాంక్ మేనేజర్ గిరిబాబు ఫీల్డ్ ఆఫీసర్ భారత్ గ్రామ సర్పంచ్ అజ్మీర ప్రభాకర్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.