SFI AISF ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం ఇబ్రహీంపట్నం మండలంలో విద్యా సంస్థల బంద్ సంపూర్ణం

Published: Thursday July 21, 2022

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి జగన్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎక్కడ కూడా పటిష్టంగా అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రైవేటు విద్యా వ్యాపారం యదేచగా సాగుతున్న ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల  ప్రైవేటు విద్యా దోపిడీకి గురవుతున్నదాని వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను విచ్చిన్నం చేయడం కోసం జాతీయ విద్యా విధానం 2020 ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్ ఇప్పటికీ రాకపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం కెసిఆర్ ప్రభుత్వ ద్వందనీతికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న డీఈవో ఎంఈఓ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేయకుండా కనీసం పాఠశాల పరిశుభ్రతను కాపాడే స్కావెంజర్స్ ని కూడా నియమించకుండా పాలన చేయడం కెసిఆర్ ద్వందనీతి పాలనకు నిదర్శనం అన్నారు. మన ఊరు మనబడి పథకంలో అన్ని ప్రభుత్వ పాఠశాలను తక్షణమే చేర్చి, సరిపడా నిధులను విడుదల చేయాలని, కార్పొరేట్, ప్రైవేటు ఫీజుల నియంత్ర చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లోఎస్ యఫ్ ఐ ఇబ్రహీంపట్నంఅధ్యక్ష కార్యదర్శలు ఏర్పుల తరంగ్ మద్దెల శ్రీకాంత్  ఎస్ఎఫ్ఐ  నాయకులు వెంకటేష్ జగదీశ్ నాయకులు వర్షిత్ వినోద్ శ్రవణ్ విక్రమ్ ఆకాష్ వంశీ విక్కీ తదితరులు పాల్గొన్నారు.