అంగన్వాడీ కేంద్రాలను గర్భిణీలు, బాలింతలు సద్వినియోగ పరుచుకోవాలి: సిడిపఓ కమల ప్రియ

Published: Thursday June 09, 2022
బోనకల్, జూన్ 8 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను గర్భిణీలు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని బోనకల్ అడిషనల్ సిడిపిఓ కమల ప్రియ అన్నారు. బుధవారం ముష్టికుంట్ల గ్రామంలో ఒకటో సెక్టార్ అంగన్వాడీ కేంద్రంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సి డి పి ఓ కమల ప్రియ మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాలు దాటిన పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిరంతరం పర్యవేక్షణ తో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా అంగన్ వాడి కేంద్రాలు పని చేస్తున్నాయని అన్నారు. కేంద్రాలలో ఇక నుండి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రారంభించామని తెలిపారు. చక్కటి విద్యతోపాటు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి జాన్బి, సూపర్వైజర్ రమాదేవి, హెల్త్ సూపర్వైజర్ స్వర్ణ మాత, గ్రామ పంచాయతీ కార్యదర్శి రఘు, షేక్ హుస్సేన్, వార్డ్ మెంబర్ ఉష, ఆరోగ్యలక్ష్మి కమిటీ సభ్యులు, తల్లులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.