రద పరిస్థితి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Thursday July 14, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై 13(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో వరద పరిస్థితులు తీవ్రమవుతున్న దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొమరం భీమ్ ప్రాజెక్టు లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటం వలన లక్ష క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయడం జరుగుతుందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నందువలన పెద్దవాగు పరిసర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా కాగజ్ నగర్, పెంచికల్ పేట్, దహేగాం, బెజ్జూర్, మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జైనూర్, కెరమెరి, సిర్పూర్ (యు) వాంకిడి, రెబ్బెన, ఆసిఫాబాద్, మండలాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ భవనం లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 18005991200, 08733 27933,కు సంప్రదించాలని, ప్రస్తుత పరిస్థితికి ప్రజలు సహకరించాలని తెలిపారు.