ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలి

Published: Friday September 17, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని టీకా సెంటర్లను పెంచడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిసరాల్లో వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో పాటు కార్పొరేషన్ మేయర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని టీకా సెంటర్లను పెంచడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశానీ సద్వినియోగం చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని ఆమె అన్నారు. బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందినీ అని సెంటర్ల లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మీర్ పేట్ కార్పొరేషన్లో (46) డివిజన్ సెంటర్లకు 12 టీమ్లుగా, బడంగ్ పేట్ కార్పొరేషన్లో (32) డివిజన్ సెంటర్లకు 12 టీమ్ లగా, అదేవిధంగా జలపల్లి మున్సిపాలిటీలో (28) వార్డుల సెంటర్లలో 10 టీమ్ లుగా కరోనా టీకా సెంటర్లకు ప్రాథమిక ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి డివిజన్లలో ఉన్న ప్రతి కాలనీలో ప్రతి ఒక్కరికి అందేటట్లు మీ ఇంటి దగ్గరికే వ్యాక్సిన్ సెంటర్లు. టీకా వేయించుకోవడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, మేనేజర్  శ్రీధర్ రెడ్డి, కార్పొరేషన్ సిబ్బంది, బాలాపూర్ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, టిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామ్ రెడ్డి, పెద్ద బావి శోభ ఆనంద్ రెడ్డి, పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, భీమిడి స్వప్న జంగారెడ్డి, లిక్కి మమతా కృష్ణారెడ్డి, ఏనుగు రామ్ రెడ్డి, సూర్ణగంటి అర్జున్, ముత్యాల లలిత కృష్ణ, కో ఆప్షన్ సభ్యులు అశోక్, రఘు నందుచారి, జగన్మోహన్ రెడ్డి, సహకార బ్యాంక్ చైర్మన్ మర్రి నర్సింహారెడ్డి, బాలాపూర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు డాక్టర్ శ్రీనివాస్, నర్సింగ్ రావు, టీఆర్ ఎస్ నాయకులు, మహిళా మణులు తదితరులు పాల్గొన్నారు.