అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు

Published: Tuesday November 08, 2022
మధిర నవంబర్ 7 (ప్రజా పాలన ప్రతినిధి)
మధిర పట్టణంలోని లడక్ బజార్ అయ్యప్ప నగర్లో వేంచేసియున్న శ్రీ  అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీకమాసం ప్రారంభ సందర్భంగా తొలిరోజు సోమవారం నాడు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పబ్బతి జగన్మోహన్ రావు  కుటుంబం ,  పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేకంగా శివేలి ప్రదక్షణ నిర్వహించారు. అనంతరం మాలదారులకు ఏర్పాటుచేసిన అన్నదానాన్ని వారు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసం ప్రారంభం నుండి మండల పూజలు పూర్తయ్యేంతవరకు మధిర పరిసర ప్రాంత అయ్యప్ప మాలదారులకు అయ్యప్ప స్వామి ఆలయంలో దాతల సహకారంతో ప్రతిరోజు ఉచితంగా అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి ఆలయంలో మాలదారులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు. 63 రోజులపాటు జరిగే ఈ అన్నదాన కార్యక్రమానికి సరిపడే బియ్యాన్ని పసుర గ్రూప్ ఆఫ్ చైర్మన్ పబ్బతి వెంకట రవి వారి సోదరులు వితరణగా అందజేశారు. తొలి రోజు మాలదారులకు అన్నదానాన్ని ప్రముఖ వైద్యులు సనుగుళ్ళ విజయ శ్రీనివాస్ దంపతులు ఏర్పాటు చేశారు. నవంబర్ 17 నుండి డిసెంబర్ 27 వరకు స్వామివారి ఆలయంలో మండల పూజలు నిర్వహించనున్నారు. అదేవిధంగా నవంబర్ 30 నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు స్వామివారి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ,  , ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులు చలువాది ధర్మారావు, చలువది శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, గురుస్వాములు , బత్తుల శ్రీనివాసరావు, చెరుపల్లి శ్రీధర్,, పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు, మైనేడి జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు