విద్యార్థులకు సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించిన కొడిమ్యాల ఎస్ఐ శివాని రెడ్డి.

Published: Thursday November 25, 2021

కొడిమ్యాల, నవంబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మంగళవారం రోజున మాడల్ స్కూల్లో విద్యార్థులకు జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆదేశాలమేరకు కొడిమ్యాల ఎస్ ఐ.శివాని ఆద్వర్యంలో సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సంద్భంగా ఎస్ఐ శివాని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సెల్ ఫోన్ ల వినియోగంపట్ల జాగ్రత్త గా వుడాలని అనవసరమైన సైట్లు ఓపెన్ చేసి సైబర్ నేరాలకు పాల్పడ వద్దని, మైనర్ పిల్లలు సెల్ ఫోన్ మాట్లాడుతు అతివేగంగా డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు గురి కావద్దని, విద్యార్థినీలు మహిళలు ఎలాంటి బెదిరింపులకు, వేదింపులకు గురైనా 100కు గానీ, 1089 చైల్డ్ లైన్ నం"లకు గాని డైల్ చేసిసహాయం పొందాలనిసూచించారు.. ఈ కార్యక్రమంలో సైబర్ మెంబర్, జె. శ్రీధర్, పాఠశాల ఇంచార్జీ రజిని, స్కూల్ టీచర్స్, విధ్యార్థులు. పాల్గొన్నారు.