కొత్తకాలనీలో ఉన్న ట్రాన్స్ఫర్మార్ ను ఊరి బయటకు షిఫ్ట్ చేయాలి

Published: Wednesday May 18, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 17 మే ప్రజాపాలన :
కొత్తకాలనీలో ఉన్న ట్రాన్స్ఫర్మార్ ను ఊరి బయటకు షిఫ్ట్ చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *"మీతో నేను"* కార్యక్రమంలో భాగంగా *వికారాబాద్ మున్సిపల్* పరిధిలోని *శ్రీరామ్ నగర్ తండా* మరియు *ధన్నారం* గ్రామంలో ఉదయం 7 గంటల నుండి 11 వరకు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిషన్ భగీరథ పైపు లైన్ కు గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, నల్లాలు ప్రతి ఇంటికి ఇచ్చి నీటిని అందించాలన్నారు. ప్రజలు చెర్రలు తీయకుండా మోటర్ లు పెట్టకుండా, నీటిని వాడుకోవాలని పేర్కొన్నారు. వారానికి ఒకరోజు వాటర్ ట్యాంక్ శుభ్రం చేయాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీరు సురక్షితమని ఈ నీటినే త్రాగాలని స్ఫష్టం చేశారు. అంగన్వాడీ, ఆయా, ఏఎన్ఎంలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆరోగ్యం మరియు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ వారికి సేవలు అందించాలన్నారు.
విద్యుత్ ట్రాన్స్ఫర్మార్ ను వెంటనే వేరే ప్రదేశానికి మార్చి థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని వెల్లడించారు. పాత స్థంభాలను తొలగించి, కొత్త స్థంభాల ఏర్పాటు చేయాలని చెప్పారు. రోడ్డు మధ్యలో ఉన్న స్థంభాలను మార్చాలని సూచించారు. ఇళ్లపై మరియు పంటపొలాల్లో వేలాడుతున్న కరెంటు తీగల సరి చేసి, ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ తెలిపారు. మరుగుదొడ్లు నిర్మించి, బిల్లులు మంజూరు కాలేనటువంటి వారికి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని అన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడుకలో ఉంచాలని ప్రజలకు సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పాడు బడ్డ ఇళ్లను తొలగించి పరిశుభ్రతను పాటించాలన్నారు. నూతనంగా మున్సిపల్ లో కలిసిన ధన్నారంలో సీసీ రోడ్లు, డ్రైనేజిలు మరియు తదితర ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని భరోసా కల్పించారు. అనంతరం లబ్ధిదారులకు మంజురైన కళ్యాణలక్ష్మి , షాదీముబారక్ చెక్కులను పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రాములు, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వైస్ చైర్మన్ శంషాద్ భేగం, పిఏసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.