తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి,

Published: Wednesday September 15, 2021
వెల్గటూర్, సెప్టెంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి) : భారతీయ జనతా పార్టీ వెల్గటూర్ మండల అధ్యక్షులు తంగళ్లపెల్లి చక్రపాణి, ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్ము రాంబాబు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని వెల్గటూర్ తహసీల్దార్లకు మంగళవారం రోజు వినతిపత్రం సమర్పించారు. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్రం విముక్తి పొందిన రోజు కాబట్టి సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగ జరపాలని భారతీయ జనతా పార్టీ వెల్గటూర్ మండల శాఖ తరుపున తహశీల్దార్ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గుంత సంతోష్, మండల ప్రధాన కార్యదర్శి రాయిల్ల రాజు, ఉపాధ్యక్షులు నస్పూరి నరసింహ చారి, బి.జే.వై.యం మండల అధ్యక్షులు దేవి రవిoదర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు రావు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి బుద్దె పోచయ్య, ఐ.టీ.సెల్ సంతోష్ రెడ్డి, మండల నాయకులు బండారి గంగాధర్, రాజయ్య, కరిడే రాజయ్య తదితరులు పాల్గొన్నారు.