జర్నలిస్టుల సమస్యల కోసం ఉద్యమించాలి ** ఈనెల 28న జిల్లా ద్వితీయ మహాసభలు ** టీయూడబ్ల్యూజే (ఐజేయు)

Published: Wednesday September 21, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 20  (ప్రజాపాలన, ప్రతినిది) : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, సంపత్ కుమార్, రాష్ట్ర సభ్యులు సదానందం బెంబ్రే లు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీయూడబ్ల్యూజే కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా ద్వితీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి టీయూడబ్ల్యూజే కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టులను ఏకతాటిపైకి తీసుకువచ్చి అనేక పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు. ఈనెల 28న జిల్లా జాతీయ మహాసభ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపంలోని ఎస్ ఎం గార్డెన్ లో జరుగుతుందని అన్నారు. ఈ సభలకు ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహత్ అలీ, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులు ఈ మహాసభలకు అధిక సంఖ్యలో తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ప్రకాష్ గౌడ్, అడప సతీష్, కృష్ణంరాజు, ఎస్ వేణుగోపాల్, మేకల శ్రీనివాస్, సురేష్ చారి, అన్నన్, వారణాసి శ్రీనివాస్, నితీష్,రాధాకృష్ణ, మిలిన్, రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.
 
 
 
Attachments area