వ్యవసాయ శాఖ వార్షిక క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Monday January 23, 2023
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 21 (ప్రజాపాలన, ప్రతినిది) : 
జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖవారి ఆధ్వర్యంలో ఆ శాఖ ప్రాధాన్యతను తెలియజేస్తూ రూపొందించిన వార్షిక క్యాలెండర్ డైరీ ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎప్పటికప్పుడు కావలసిన సలహాలు, సూచనలు అందించాలన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించిన వివరాలను వారికి ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. పంట దిగుబడికి పాటించాల్సిన చిట్కాలను సూచించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఏడీఏలు, ఏవోలు, ఏఈవోలు, తదితరులు పాల్గొన్నారు.